అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం ఏప్రిల్ 14 వరకు పొడిగింపు

  • డీజీసీఏ అనుమతి ఉన్న విమానాలకు, రవాణా విమానాలకు మినహాయింపు
  • దేశీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కూడా పొడిగించే అవకాశం
  • లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు కేంద్రం కఠినచర్యలు
దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని తాజాగా ఏప్రిల్ 14 వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

అయితే డీజీసీఏ అనుమతి ఉన్న విమానాలు, రవాణా విమానాలకు ఇది వర్తించదని తెలిపింది. అటు, దేశీయంగానూ విమాన సర్వీసులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ దేశీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కూడా పొడిగించేందుకు కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి భారత్ లో రెండో దశలో ఉన్నందున, దాన్ని అంతటితో ఆపేయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.


More Telugu News