‘కరోనా’పై పోరాటానికి విరాళాలు.. పన్ను మిహాయింపు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

  • సీఎం సహాయ నిధికి విరాళాలిస్తే 100శాతం పన్ను మినహాయింపు
  • చెక్ ద్వారా అయితే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ కు  
  •  ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి  ఉత్తర్వులు
కరోనా వైరస్ వ్యాప్తి  చెందకుండా చేసే పోరాటానికి  తమ వంతు కృషిగా ప్రభుత్వ ఉద్యోగులు, సెలెబ్రిటీలు, వ్యాపార ప్రముఖులు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.  ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలిచ్చే వారికి వందశాతం పన్ను మినహాయింపు ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వి. ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. చెక్ ద్వారా విరాళాలు ఇవ్వదలచుకున్న వారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ పేరు పై, బ్యాంకుల ద్వారా పంపాలనుకున్న వారు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నెంబర్ 38588079208, వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్, IFSC కోడ్ : SBIN001884, ఆంధ్రా బాంక్, అకౌంట్ నెంబర్: 110310100029039, వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్, IFSC CODE: ANDB0003079 కు పంపాలని సూచించారు.


More Telugu News