ఇంటి వద్దకే ఔషధాల అందజేతకు కేంద్రం అనుమతి

  • 'షెడ్యూల్ హెచ్' కేటగిరీ ఔషధాల డెలివరీ
  • డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
  • దేశంలో 649కి చేరిన కరోనా కేసులు
కరోనా మహమ్మారి పీచమణిచేందుకు దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని రకాల ఔషధాలను డోర్ డెలివరీ రూపంలో అందించేందుకు అనుమతి ఇచ్చింది. కరోనా నివారణపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇంటి వద్దకే ఔషధాల అందజేత విధానం పట్ల కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసింది.

 అయితే, ఈ వెసులుబాటును 'షెడ్యూల్ హెచ్' కేటగిరీకి చెందిన ఔషధాలకు కూడా ఇస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఈ కేటగిరీ మందులకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రం వుండాలి. స్వయంగా గానీ, ఈ మెయిల్ ద్వారా కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపిస్తేనే ఈ తరహా ఔషధాలను రోగులకు డోర్ డెలివరీ చేస్తారు. అటు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 649 అని, 13 మరణాలు సంభవించాయని కేంద్రం ప్రకటించింది. 42 మందికి కరోనా నయమైందని కేంద్రం పేర్కొంది.


More Telugu News