సౌదీ నుంచి వచ్చిన మహిళా రోగి ద్వారానే ఢిల్లీ డాక్టర్ కు కరోనా!
- 10న సౌదీ నుంచి ఢిల్లీకి వచ్చిన మహిళ
- 12న కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వైనం
- ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ కు కరోనా పాజిటివ్
ఢిల్లీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న ఓ కమ్యూనిటీ క్లినిక్ లో పని చేస్తున్న డాక్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో... అతనికి కాంటాక్ట్ లోకి వచ్చిన 900 మందిని క్వారంటైన్ చేశారు. ఈ చైన్ ఓ మహిళ (38) నుంచి ప్రారంభం కావడం గమనార్హం. మార్చి 10న సదరు మహిళ సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చింది. కరోనా లక్షణాలు కనిపించడంతో 12వ తేదీన కమ్యూనిటీ ఆసుపత్రిలో ఆమె చేరింది. ఐదు రోజుల తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. అదే రోజున ఆమెకు చికిత్స చేసిన డాక్టర్ కూడా కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు.
ఇదే సమయంలో సౌదీ నుంచి వచ్చిన మహిళకు డైరెక్ట్ కాంటాక్ట్ లోకి వచ్చిన మరో ఐదుగురికి (తల్లి, సోదరుడు, ఇద్దరు కుమార్తెలు, ఒక బంధువు) కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరు ఐదుగురు ఆమెను ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి తీసుకెళ్లారు. మరోవైపు ఆమె ఇంటి చుట్టుపక్కల ఉన్న 74 మందిని పరిశీలనలో ఉంచారు. మరోవైపు సదరు మహిళకు చికిత్స చేసిన డాక్టర్ కే కాకుండా, ఆయన భార్య, కూతురుకు కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో... ఆయనకు డైరెక్ట్ కాంటాక్ట్ లోకి వచ్చిన 900 మందిని క్వారంటైన్ చేశారు.