భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. దూసుకుపోయిన స్టాక్ మార్కెట్

  • 1,411 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 324 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ఏకంగా 46 శాతం ఎగబాకిన ఇండస్ ఇండ్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో... పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, వారు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,411 పాయింట్లు లాభపడి 29,947కి పెరిగింది. నిఫ్టీ 324 పాయింట్లు పుంజుకుని 8,641కు ఎగబాకింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం, ఫైనాన్స్, బ్యాకింగ్ షేర్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్;
ఇండస్ ఇండ్ బ్యాంక్ (46.08%), ఎల్ అండ్ టీ (10.00%), బజాజ్ ఫైనాన్స్ (9.05%), బజాజ్ ఆటో (8.59%), భారతి ఎయిర్ టెల్ (8.13%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.51%), సన్ ఫార్మా (-2.35%), మారుతి సుజుకి (-1.75%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.48%), టాటా స్టీల్ (-1.28%).


More Telugu News