కరోనాకు ఎలాంటి మందు లేదు.. బయటకు రాకండి: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

  • కరోనాకు నివారణ ఒక్కటే మార్గం
  • అందరం కలసి మహమ్మారిని ఎదుర్కొందాం
  • పోలీసు వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది
భారత్ లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ కరోనాకు మందు లేదని చెప్పారు. నివారణ ఒక్కటే ఏకైక మార్గమని అన్నారు. ప్రజలంతా ఉమ్మడిగా ఈ మహమ్మారిని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.

ఇక ఈ క్లిష్ట సమయంలో పోలీసు వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోందని చెప్పారు. ప్రజలెవరూ ఇళ్లను దాటి బయటకు రావద్దని మంత్రి కోరారు. గ్రామ వాలంటీర్లు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని... వారికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ సూచనలను అందరూ పాటించాలని కోరారు.


More Telugu News