ఇతను నిజమైన హీరో!: టీఆర్‌ఎస్ నాయకురాలు కవిత
- రైతు చేసిన సాయంపై కవిత ప్రశంసల జల్లు
- పేపర్ల ద్వారా కరోనా గురించి తెలుసుకుంటున్నానన్న ఓ రైతు
- తన పొలంలో ఈ ఏడాది పంట కూడా బాగానే పండిందని వ్యాఖ్య
- ఇటీవలే పంట డబ్బులు వచ్చాయని, సాయం చేస్తానని రైతు ప్రకటన
'ఇతడు నిజమైన హీరో' అంటూ టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఓ వార్తను పోస్ట్ చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నారని తెలుసుకుని వారికి ఆదిలాబాద్ జిల్లా లాండసాంగ్వి రైతు మోర హన్మాండ్లు అనే రైతు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాడని తెలిపారు.
'కొన్ని రోజులుగా పేపర్లలో కరోనా వైరస్ గురించి తెలుసుకుంటున్నాను. ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. నాకున్న నాలుగెకరాల పొలంలో ఈ ఏడాది పంట కూడా బాగానే పండింది. ఇటీవలే పంట డబ్బులు వచ్చాయి. రాష్ట్రం లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు తినడానికి తిండి దొరకడం లేదనే విషయం తెలిసింది. వారికి సాయం చేద్దామని నా కుమారులు తెలిపారు. దీంతో రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం' అని రైతు మోర హన్మాండ్లు తెలిపారు. ఈ విషయంపైనే కవిత ఈ పోస్ట్ చేశారు.