మన దేశాన్ని మనమే రక్షించుకుందాం: విక్టరీ వెంకటేశ్ వీడియో
- మనందరికీ మన దేశానికి సేవ చేసే సమయం వచ్చింది
- మనమేమీ చేయలేమనుకోవద్దు
- రోజురోజుకీ భయం కాదు.. బాధ్యత పెరగాలి
- ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలి
ప్రాణాంతక కొవిడ్-19 వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ కోరారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా వీడియోలో సందేశం ఇచ్చారు.
'మనందరికీ మన దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. మనమేమీ చేయలేమనుకోవద్దు.. రోజురోజుకీ భయం కాదు.. బాధ్యత పెరగాలి. అందరూ ఒకరికొకరు దూరంగా ఉండాలి.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలి. కరోనా వైరస్ నుంచి మనదేశాన్ని మనమే రక్షించుకుందాం' అని వెంకటేశ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ అగ్ర నటులు కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ సూచనలు చేసిన విషయం తెలిసిందే.