అమరావతి ఉద్యమకారులను సమాజం గుర్తించాలి: చంద్రబాబు

  • అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ఈ రోజు వందో రోజు
  • అడుగడుగునా నిర్బంధాలు, పోలీసు కేసులు
  • కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమం కొనసాగిస్తున్నారు 
అమరావతి పరిరక్షణ ఉద్యమం వందో రోజుకు చేరుకున్న నేపథ్యంలో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. 'అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ఈ రోజు వందో రోజు. అడుగడుగునా నిర్బంధాలు, పోలీసు కేసులు, వేధింపులు, అవమానాల నడుమ ఇన్ని రోజులు కొనసాగిన ఉద్యమం... ఇప్పుడు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కొనసాగుతూనే ఉంది' అని తెలిపారు.

'రైతులు, మహిళలు, రైతు కూలీలు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మిలిటరీ వాళ్లు దేశం కోసం అండగా నిలిచినట్టుగానే... రాష్ట్ర రాజధాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తున్న అమరావతి ఉద్యమకారులను సమాజం గుర్తించాలి' అని ట్వీట్లు చేశారు.

'ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలి. రాజధాని అమరావతి ఆకాంక్ష ఎంత బలంగా ఉందో గ్రహించి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి' అని డిమాండ్ చేశారు.



More Telugu News