కరోనాపై ఈ చర్యలు సరిపోవు: ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో సూచన
- లాక్‌డౌన్‌తో పాటు మరింత దూకుడుగా వ్యవహరించాలి
- కఠిన చర్యలు తీసుకోవాలి
- కరోనా రోగులను గుర్తించి, వారిని ఐసోలేట్ చేయాలి
కరోనాను కట్టడి చేయడానికి కేవలం లాక్‌డౌన్ చర్యలు సరిపోవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అదనమ్ గెబ్రియాసిస్ అన్నారు. మరింత దూకుడుగా వ్యవహరించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించారు.
సామాజిక, ఆర్థిక నిబంధనలతో పాటు కఠిన నియమాలు పాటించాలన్నారు. కరోనా రోగులను గుర్తించి, వారిని ఐసోలేట్ చేయాలని తెలిపారు. అందరికీ కరోనా పరీక్షలు చేసి, నిర్ధారణ అయిన వారికి చికిత్స అందించాలని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలోనే కరోనా వైరస్‌పై అటాక్ చేయాలని, ఈ అవకాశాన్ని అన్ని దేశాలు వాడుకోవాలన్నారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను మరింత విస్తరించాలని కోరారు. పూర్తి స్థాయిలో అనుమానిత కేసులను గుర్తించే వ్యవస్థను రూపొందించుకోవాలని సూచించారు.