ఎంత జాగ్రత్తగా ఉండాలంటే.. అంత జాగ్రత్తగా ఉండాలి: న్యూజిలాండ్ ప్రధాని

  • కరోనా సోకిందన్న భావనతో జాగ్రత్తగా ఉండాలని సూచన
  • దేశంలో ఒకేసారి 50 మందికి సోకిన వైరస్
  • ముందు జాగ్రత్త చర్యగా నెల రోజులపాటు లాక్‌డౌన్
న్యూజిలాండ్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ఆ దేశ ప్రభుత్వం నెల రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ దేశ ప్రజలను ఉద్దేశించి  మాట్లాడారు. వైరస్ విషయంలో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కరోనా వైరస్ సోకితే ఎంత అప్రమత్తంగా ఉంటారో.. అంతే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. న్యూజిలాండ్‌లో కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. అయితే, ఒకేసారి 50 మందికి ఈ వైరస్ సోకడం, మొత్తంగా 205 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత అర్ధరాత్రి నుంచే దేశంలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది.


More Telugu News