కొవిడ్-19పై రూమర్లకు కేంద్రం చెక్.. డ్యాష్‌బోర్డు అందుబాటులోకి!

  • అధికారికంగా డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
  • ప్రతీ నాలుగు గంటలకోసారి అప్‌డేట్ 
  • కోవిడ్ కేసులపై గందరగోళానికి తెర
దేశంలో కొవిడ్-19 మరణాలు, కేసులకు సంబంధించి వస్తున్న పొంతనలేని వార్తలకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇందులో భాగంగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కోవిడ్19ఇండియా.ఓఆర్‌జీ (www.covid19india.org) పేరుతో అధికారికంగా ఓ డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి ఏ రాష్ట్రంలో ఎలా ఉంది.. ఎక్కడ ఎంతమంది మరణించారు అన్న విషయాలపై వాస్తవ గణాంకాలను ఇందులో పొందుపరచనుంది. ప్రతీ నాలుగు గంటలకు ఒకసారి అప్పటి సమాచారం ప్రకారం దీనిని అప్‌డేట్ చేయనుంది.

ఈ డ్యాష్‌బోర్డు ప్రకారం.. రాత్రి పదిగంటల సమయానికి దేశంలో 645 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. వీటిలో 591 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 43 మంది కోలుకున్నారు. 11 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు 8 కేసులు నమోదు కాగా, ఒకరు రికవర్ అవగా, ఏడు యాక్టివ్‌గా ఉన్నాయి. తెలంగాణలో 39 కేసులు నమోదు కాగా, 38 యాక్టివ్‌గా ఉన్నాయి. ఒకరు కోలుకోగా, ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.


More Telugu News