ఫ్యాక్టరీని మూసేసిన యాజమాన్యం.. 80 కిలోమీటర్ల దూరంలోని ఊరికి కాలినడకన కూలీలు!
- ఉన్నావోలోని స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువకులు
- రవాణా సౌకర్యం లేక కాలిబాటన యువకులు
- రేపు ముగియనున్న ప్రయాణం
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశం మొత్తాన్ని 21 రోజులపాటు లాక్‌డౌన్ చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ నిన్న రాత్రి ప్రకటించారు. దీంతో దేశం మొత్తం మూతబడింది. నిత్యావసరాలు మినహా అన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో ఓ స్టీల్ ఫ్యాక్టరీని మూసేసిన యాజమాన్యం అందులో పనిచేస్తున్న కూలీలను ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా కోరింది.
అంతవరకు బాగానే ఉన్నా.. రవాణా వ్యవస్థ మొత్తం నిలిచిపోవడంతో 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి ఎలా వెళ్లాలో తెలియని ఆ యువకులు కాలినడకను ఎంచుకున్నారు. నిన్న రాత్రి ఉన్నావో నుంచి తమ గ్రామం బారాబంకికి బయలుదేరిన యువకులు ఇంకా నడుస్తూనే ఉన్నారు. రేపు ఉదయానికి స్వగ్రామం చేరుకుంటామని తెలిపారు. మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ దొరికింది తింటూ నడక సాగిస్తున్నట్టు యువకులు తెలిపారు. తమలాంటి ఎంతోమంది రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు.