పేద కళాకారుల కోసం వీవీ వినాయక్ రూ. 5 లక్షల విరాళం

  • షూటింగులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న పేద కళాకారులు
  • నిత్యావసర సరుకుల కోసం రూ. 5 లక్షల చెక్
  • అవసరమైన వారు కాదంబరి కిరణ్‌ను సంప్రదించాల్సిందిగా సూచన
కరోనా వైరస్ కారణంగా షూటింగులు వాయిదా పడడంతో ఇబ్బందులు పడుతున్న పేద కళాకారులను ఆదుకునేందుకు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ముందుకొచ్చారు. తన వంతు సాయంగా రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు కాదంబరి కిరణ్‌కు చెక్కును అందించనున్నట్టు తెలిపారు. నిత్యావసర సరుకులు అవసరమైన వారు కిరణ్‌ను సంప్రదించాలని సూచించారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అందరం ఇళ్లలోనే ఉండి ఆ మహమ్మారిని వణికించాలని వినాయక్ పిలుపునిచ్చారు. షూటింగులు లేకపోవడంతో పరిశ్రమలోని పేద కళాకారులు, ఫైటర్లు, డ్యాన్స్ మాస్టర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి అందించాలని కోరుతూ కాదంబరి కిరణ్‌కు రూ. 5 లక్షలు ఇస్తున్నానని, అవసరమైన వారు ఆయనను సంప్రదించాలని వినాయక్ కోరారు.


More Telugu News