మహాభారత యుద్ధాన్నే 18 రోజుల్లో ముగించాం.. కరోనాను 21 రోజుల్లో ఓడించలేమా?: మోదీ
- ఇప్పుడు అందరి లక్ష్యం ఇల్లే కావాలి
- ఇంటి గడప దాటకుండానే విజయం సాధిద్దాం
- ఐకమత్యంగా కరోనాను ఎదుర్కొందాం
ఇంటి గడప దాటకుండా కరోనా రక్కసిపై విజయం సాధిద్దామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వారణాసి ప్రజలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ.. యావత్ దేశం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదని అన్నారు. ఈ విపత్కర సమయంలో అందరం కలిసి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఐకమత్యంగా కరోనాను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. 21 రోజుల తర్వాత కరోనా మహమ్మారిపై విజయం సాధించబోతున్నామన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వారణాసి ప్రజలు దేశానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. అందరి లక్ష్యం ఇల్లే కావాలని, సామాజిక దూరాన్ని అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఈ మహమ్మారిపై యుద్ధం చేయాల్సిందేనన్నారు. మహాభారత యుద్ధాన్నే 18 రోజుల్లో జయించామని, కరోనాను 21 రోజుల్లో జయించలేమా? అని ప్రశ్నించారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని గురుద్వారాలో జరిగిన ఉగ్రదాడిని మోదీ ఖండించారు. ఐసిస్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 27 మందికి సంతాపం ప్రకటించారు.