అందుకే భారీ మూల్యం చెల్లించాల్సివస్తోంది: కరోనాపై ప్రశాంత్‌ కిషోర్‌

  • లాక్‌డౌన్‌ మరింత పొడిగించే అవకాశాలు ఎక్కువ
  • కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశం సరైన విధంగా సన్నద్ధం కాలేదు
  • భవిష్యత్తులో మరింత కఠిన పరిస్థితులు చూడాల్సి వస్తుంది 
భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్య మంచిదేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. అయితే, లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశం సరైన విధంగా సన్నద్ధం కాలేదని ప్రశాంత్ కిషోర్‌ చెప్పారు. అందుకే భారీ మూల్యం చెల్లించాల్సివస్తోందని, భవిష్యత్తులో మరింత కఠిన పరిస్థితులు చూడాల్సి వస్తుందని తెలిపారు. కాగా, దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య  562కు చేరింది. కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.


More Telugu News