కరీంనగర్ రైతు బజార్‌లో దారుణం.. వ్యక్తి మృతి.. కరోనా భయంతో ముట్టుకోని స్థానికులు
- కూరగాయలు కొనేందుకు వచ్చిన వ్యక్తి
- గుండెపోటుతో మృతి
- మృతదేహానికి దూరంగా స్థానికులు
- సమాచారం అందుకున్న పోలీసులు
కరోనా విజృంభణ కారణంగా ఎన్నడూ జరగని విపరీత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. గుండెపోటుతో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయిన వ్యక్తికి సాయం చేయని దయనీయ పరిస్థితి కరీంనగర్‌లో చోటు చేసుకుంది. ఆ జిల్లాలో ఇండోనేషియా వాసులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తమకు సోకుతుందేమోనని భయపడుతున్నారు.
ఆ జిల్లాలోని కశ్మీర్‌గడ్డ రైతు బజార్‌కు ఈ రోజు కూరగాయల కోసం ఓ వ్యక్తి వచ్చి, వాటిని కొంటోన్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే మృతి చెందాడు. అయితే, ఆ మృతదేహం వద్దకు రావడానికి కూడా స్థానికులు భయపడ్డారు.. దూరంగానే ఉండిపోయారు. చివరకు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.