ఒకరిని కొట్టిన లాఠీతో మరొకరిని కొట్టాల్సి వస్తే... కరోనా సోకకుండా పోలీసుల నయా ప్లాన్!

  • లాక్ డౌన్ ను పట్టించుకోని యువత
  • లాఠీలను శానిటైజర్ తో శుభ్రం చేస్తున్న పోలీసులు
  • వైరల్ అవుతున్న వీడియో
కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకడం ప్రారంభమైన తరువాత, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి రాగా, కొందరు ఆకతాయిలు మాత్రం నిబంధనలను పట్టించుకోకుండా, రోడ్ల పైకి వచ్చి, ఇష్టానుసారం తిరుగుతుంటే పోలీసులు తమ లాఠీలకు పని కల్పించారు. ఖాళీగా కనిపిస్తున్న రహదారులపైకి దూసుకొస్తున్న యువతను అదుపు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు మరో సమస్య ఎదురైంది.

ఒకసారి లాఠీతో ఒకరిని కొట్టిన తరువాత, మళ్లీ దాన్ని తిరిగి వినియోగిస్తే, కరోనా వ్యాప్తికి సహకరించినట్టు అవుతుంది. దీంతో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన న్యూఢిల్లీ పోలీసులు, తమ లాఠీలను శానిటైజర్ తో పరిశుభ్రం చేస్తున్నారు. లాఠీలను శుభ్రం చేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఐపీఎస్ అధికారి పంకజ్ నైన్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 'ఫుల్ తయ్యారీ' అని క్యాప్షన్ పెట్టారు. దాన్ని మీరూ చూడవచ్చు.




More Telugu News