విశాఖ జైలు నుంచి విడుదల కానున్న 250 మంది ఖైదీలు!

  • జైళ్లను తాకిన మహమ్మారి భయం
  • సుప్రీం మార్గదర్శకాల మేరకు బెయిల్ పై ఖైదీలు
  • అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న అధికారులు
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన జైళ్లనూ తాకింది. ఇప్పటికే విశాఖ సెంట్రల్ జైలు, ఖైదీలతో కిక్కిరిసి ఉండగా వారిని కలిసేందుకు వచ్చే బంధువుల ములాఖత్ ల కారణంగా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకవచ్చన్న ఆందోళన నెలకొంది.

 సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిమాండ్‌ ఖైదీలతో పాటు వివిధ రకాల కేసుల్లో ఏడు సంవత్సరాలలోపు శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను బెయిల్‌ పై విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జైలు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జైలులో నిబంధనల మేరకు బెయిల్ కు అర్హులైన వారు 250 మంది వరకూ ఉంటారని, వారి విడుదలపై అతి త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని జైలు అధికారి ఒకరు తెలియజేశారు.


More Telugu News