డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కదాని... క్లోరోక్విన్ తీసుకుని అమెరికన్ మృతి!
- వైద్య చరిత్రను మార్చివేసే క్లోరోక్విన్, అజిత్రోమైసిన్
- ఔషధాలను నేరుగా తీసుకున్న వృద్ధ జంట
- భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ల కలయికలో రానున్న కొత్త ఔషధాలు, వైద్య చరిత్రను మార్చివేస్తాయని, కరోనాను కట్టడి చేయడంలో క్లోరోక్విన్ ప్రధాన పాత్రను పోషించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలను విని, ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన ఆరిజోనా ప్రాంతంలో జరిగింది. 60 సంవత్సరాలు దాటిన ఓ జంట, క్లోరోక్విన్ ఫాస్పేట్ ను నేరుగా తీసుకుంది.
ఆ వెంటనే వారిద్దరూ స్పృహ కోల్పోగా, ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మలేరియా నివారణకు వాడే క్లోరోక్విన్ ను కరోనాకు వ్యాక్సిన్ లా భావించవద్దని డాక్టర్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయినా క్లోరోక్విన్ డ్రగ్ ను కొనేందుకు మెడికల్ షాపుల ముందు జనాలు బారులు తీరుతున్నారు.