కొడుకు నుంచి కొత్తగూడెం డీఎస్పీకి, ఇంటి పనిమనిషికి సోకిన కరోనా!

  • తెలంగాణలో 39కి చేరిన కరోనా కేసుల సంఖ్య
  • విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి, లోకల్‌ కాంటాక్ట్‌ ద్వారా ముగ్గురికి
  • మంగళవారం ఆరు కేసులు నమోదు
తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మంగళవారం ఒక్కరోజులో 33 నుంచి 39కి పెరిగింది. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి, లోకల్‌ కాంటాక్ట్‌ ద్వారా మరో ముగ్గురికి వైరస్ సోకింది. తన కుమారుడిపై ఉన్న ప్రేమతో, హోమ్ ఐసోలేషన్ ను పాటించని కొత్తగూడెం డీఎస్పీ (57), ఆయన ఇంట్లో పని చేసే వంటమనిషి (33)కి కరోనా సోకింది. ఇదే సమయంలో తెలంగాణలో 25వ పాజిటివ్ గా నమోదైన వ్యక్తి ద్వారా ఓ మహిళకు కూడా వైరస్ సోకింది.

దీంతో కొత్తగూడెం డీఎస్పీ, వంట మనిషి, మరో మహిళ ఎవరెవరిని కలిశారన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వైరస్ లోకల్ కాంటాక్ట్ తీవ్రత కొనసాగితే దీని వ్యాప్తి ప్రమాదకరమైన మూడో స్టేజ్ కి వెళ్లడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చని వైద్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక రాష్ట్రంలో దాదాపు 1,650 మంది మహిళలు ప్రసవాలకు సిద్ధం కాగా, ఎవరెవరు ఏ రోజున ప్రసవం అవుతారో తేదీలను నిర్ణయించి, ఆయా రోజులకు వారిని స్పెషల్ అంబులెన్స్ లలో హాస్పిటల్స్ కు చేర్చాలని అధికారులు నిర్ణయించారు.


More Telugu News