నేడు శ్రీ శార్వరీ నామ సంవత్సర ఉగాది... బోసిపోయిన ఆలయాలు!

  • ఆలయాల్లోకి భక్తుల ప్రవేశంపై నిషేధం
  • అన్ని దేవాలయాల్లో ఏకాంత పూజలే
  • మార్కెట్లలో కనిపించని ప్రజలు
శ్రీ శార్వరీ నామ సంవత్సరం నేటి నుంచి మొదలైంది. నేడు ఉగాది పర్వదినం కాగా, ఆలయాలన్నీ భక్తులు లేక బోసిపోయాయి. సాధారణంగా పండగంటేనే దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఇక ఉగాది అంటే, తెల్లవారుజామునే తెరచుకునే మార్కెట్లు, కొత్త మామిడి కాయలు, బెల్లం, వేపపువ్వు, కొత్త చింతపండు... వాటి కొనుగోలు నిమిత్తం వచ్చే ప్రజలతో కళకళలాడే ప్రాంతాల్లో, ఇప్పుడు జనం కనిపించడం లేదు.

కరోనా భయంతో ఇప్పటికే ఆలయాలకు భక్తుల రాకను అనుమతించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించిన నేపథ్యంలో, అన్ని దేవాలయాల్లోనూ ఏకాంత పూజలే జరుగుతున్నాయి. ఈ ఉదయం 6 గంటల సమయంలో మార్కెట్లు తెరచుకున్నా, ప్రజల సందడి నామమాత్రంగానే కనిపిస్తోంది. మార్కెట్లో వేపపూత నామమాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News