ఈ ఏడాది ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నాం: ఏపీ మంత్రి వెల్లంపల్లి
- రేపు ఉగాది పండగ
- కుటుంబం, సమాజం బాగున్నపుడే నిజమైన ఉగాది
- ‘కరోనా’ కారణంగా నిరాడంబర వేడుకలు
రేపు ఉగాది పండగను పురస్కరించుకుని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కుటుంబం, సమాజం బాగున్నపుడే నిజమైన ఉగాది అని అన్నారు. ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఈసారి మాత్రం వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రేపు ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే, ప్రజలకు, భక్తులకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని, సహకరించాలని కోరారు.