‘కరోనా’ నివారణకు సీఎం సహాయ నిధికి విరాళం ఇవ్వాలని నిర్ణయించాం: నారా లోకేశ్
- మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు
- టీడీఎల్పీ సభ్యులు నెల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించాం
- పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 వేలు ఆర్థిక సహాయం ఇవ్వాలి
కరోనా వైరస్ నివారణ నిమిత్తం సీఎం సహాయనిధికి విరాళం ఇవ్వాలని నిర్ణయించామని టీడీపీ నేత నారా లోకేశ్ పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తమ అధినేత చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని టీడీఎల్పీ సభ్యులు నెల వేతనాన్ని కరోనా సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని, పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 వేలు ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.