డిజిటల్ కరెన్సీ వినియోగించాలని ప్రజలకు మంత్రి ఈటల సూచన

  • నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలపై సమీక్ష
  • ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి
  • ప్రజలు గుమికూడకుండా ఉండేలా చూడాలని ఆదేశాలు
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున డిజిటల్ పేమెంట్స్ చేయాలని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలపై సీఎస్ సోమేశ్ కుమార్ తో కలిసి ఇవాళ ఆయన సమీక్షించారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని, మాంసం, చేపలు, కోడిగుడ్ల మార్కెట్లను తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించినందున ఆ దుకాణాలు నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, రైతు బజార్లు, సూపర్ మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడకుండా ఉండేలా చూడాలని ఆదేశించారు.


More Telugu News