'ఇప్పుడు క్వారంటైనే మన వాలంటైన్' అన్న కవితను ఉదాహరించిన సీఎం కేసీఆర్
- ఐనంపూడి శ్రీలక్ష్మి కవితను ప్రస్తావించిన తెలంగాణ సీఎం
- కరోనాపై సానుకూల దృక్పథంతో కవితలు రాయాలంటూ కేసీఆర్ పిలుపు
- కరోనాపై కవిసమ్మేళనాలను మీడియా ప్రోత్సహించాలని విజ్ఞప్తి
తెలంగాణలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కవులు సానుకూల దృక్పథంతో కవితలు రాయాలని, ప్రజల్లో ధైర్యం పెంపొందేలా రచనలు చేయాలని సూచించారు. ఓ కవితను ఈ సందర్భంగా చదివి వినిపించారు. 'ఇప్పుడు క్వారంటైనే మన వాలంటైన్' అనుకోవాలంటూ ఐనంపూడి శ్రీలక్ష్మి రాసిన కవిత అద్భుతంగా ఉందని, ఆ కవితలో గొప్పభావం ఉందని ప్రశంసించారు. ఒంటరిగా ఉంటూనే సమష్టిగా యుద్ధం చేయాలని ఉద్బోధించారని కితాబిచ్చారు. కరోనాపై పోరాటంలో భాగంగా మీడియా సంస్థలు కూడా కవి సమ్మేళనాలు నిర్వహించాలని తెలిపారు.