విశాఖలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి: ఏపీ మంత్రి ఆళ్ల నాని

  • ఈ జిల్లాలో 1470 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు
  • విశాఖలో 20 కమిటీలను ఏర్పాటు చేశాం
  • రాష్ట్రంలో ‘కరోనా’ నిరోధానికి అన్ని చర్యలు చేపట్టాం
విశాఖపట్టణంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖలో పరిస్థితిపై సమీక్షించినట్టు చెప్పారు. విశాఖలో ఇప్పటి వరకు మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఈ జిల్లాలో 1470 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా విశాఖలో 20 కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు.

రాష్ట్రంలో ‘కరోనా’ వ్యాప్తి నిరోధానికి అన్ని చర్యలు చేపట్టామని, ఇందుకుగాను ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు. అదేవిధంగా, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు అధికారులకు సహకరించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని క్వారంటైన్ కు తరలిస్తామని  అన్నారు.


More Telugu News