లాక్ డౌన్ ను ప్రజలు ఉల్లంఘించడంపై కేంద్రం సీరియస్.. కర్ఫ్యూ విధించాలంటూ రాష్ట్రాలకు సూచన
- లాక్ డౌన్ ను పెద్దగా పట్టించుకోని ప్రజలు
- కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు నీరుగారిపోయే అవకాశం
- ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం
కరోనా వైరస్ విస్తరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ చాలా మంది ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో, కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నీరుగారిపోయే అవకాశాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.
లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలను జారీ చేసింది. అవసరమైతే చట్ట ప్రకారం కర్ఫ్యూని విధించాలని సూచించింది. కర్ఫ్యూ అమల్లోకి వస్తే... ఎవరూ కూడా రోడ్లపై కనిపించడానికి కూడా వీలుండదు. ఎవరైనా రోడ్లపైకి వస్తే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు.