'కరోనా' నేపథ్యంలో.. సినీ కార్మికులకు రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించిన రజనీకాంత్!

  • ఎంపీల్యాడ్‌ నుంచి రూ.5 కోట్లు ప్రకటించిన కేశినేని నాని
  • రూ.50 లక్షలు ప్రకటించిన గౌతం గంభీర్‌
  • సినీ కార్మికులకు రజనీకాంత్ రూ.50 లక్షల సాయం
 కరోనా నేపథ్యంలో సినిమా షూటింగులు ఆగిపోవడంతో సినీ కార్మికులు ఇబ్బందిపడుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్ సౌతిండియా కార్మికులకు ఆయన రూ.50 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.

ఇక, తన ఎంపీల్యాడ్స్ నిధుల నుండి రూ.5 కోట్లను విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కరోనా వైరస్ నివారణ సహాయక చర్యల నిమిత్తం ఇవ్వాలనుకుంటున్నానని ఎంపీ కేశినేని నాని తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌తో పాటు మునిసిపల్ కమిషనర్ తమ ప్రతిపాదనలు వెంటనే పంపవలసినదిగా కోరుతున్నానని తెలిపారు.

టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు తెలుపుతూ వీటిని ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్సకు అవసరమైన పరికరాల కోసం వినియోగించాలని కోరారు. 


More Telugu News