మహారాష్ట్రలో సెంచరీ దాటిన కరోనా పాజిటివ్ కేసులు
- కరోనా ధాటికి వణుకుతున్న మహారాష్ట్ర
- 101కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
- మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం
కరోనా వైరస్ మన దేశంలో అంతకంతకూ విస్తరిస్తోంది. లాక్ డౌన్ ఉన్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపై సంచరిస్తున్నారు. మరోవైపు కరోనా ధాటికి మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 101కి చేరాయి. దీంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఈశాన్య భారతంలో కూడా తొలి కరోనా కేసు నమోదైంది. మణిపూర్ లో 23 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ఇటీవలే ఆమె లండన్ లో పర్యటించి వచ్చింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సాయంత్రం 8 గంటలకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ ప్రసంగంలో ఆయన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.