తెలంగాణా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘిస్తోన్న వారి వాహనాలను సీజ్ చేస్తోన్న పోలీసులు
- తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తోన్న వారిపై చర్యలు
- పలు జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతోన్న ప్రజలు
- అత్యవసర పరిస్థితుల్లోనే రోడ్లపైకి రావాలంటోన్న పోలీసులు
తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తోన్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోకి వచ్చే రోడ్లను పోలీసులు మూసేశారు. నాగారం, అర్సపల్లి, ముబాకర్ నగర్ వద్ద పోలీసులు మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి వాహనాలు రాకుండా బోర్గాం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
పలు జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతోన్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు మోహరించారు. ద్విచక్ర వాహనాలపై ఒకరి కంటే ఎక్కువ మంది వెళ్తే కేసులు పెడుతున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న కొందరి వాహనాలను సీజ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్, వాడపల్లి వద్ద ఏపీ నుంచి వస్తున్న వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు.
హైదరాబాద్‌లో అత్యవసర పరిస్థితుల్లోనే రోడ్లపైకి రావాలని పోలీసులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయడానికి అనుమతి ఉంది. నిబంధనలను ఉల్లంఘిస్తోన్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.