తెలంగాణలో మీ సేవా కేంద్రాల షట్ డౌన్: ఐటీ శాఖ ఉత్తర్వులు
- 31 వరకూ అమలులో నిర్ణయం
- కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే
- ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడివున్నామన్న ఆపరేటర్ల సమాఖ్య
ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతున్న తెలంగాణలో, మీ సేవా కేంద్రాలను ఈ నెల 31 వరకూ మూసివేస్తున్నట్టు ఆపరేటర్ల సమాఖ్య వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అధీనంలో 107 మీ సేవా కేంద్రాలుండగా, వాటిని నెలాఖరు వరకూ మూసివేయాలని నిన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన తెలంగాణ మీ సేవ ఆపరేటర్ల సమాఖ్య, వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడివున్నామని, మీ సేవా కేంద్రాలను మూసి వేస్తున్నామని స్పష్టం చేసింది.