31 వరకూ అన్ని డైలీ పేపర్లపైనా నిషేధం... హైదరాబాద్ లో హాకర్ల నిర్ణయం!
- కరోనా నివారణ చర్యల్లో భాగంగా నిర్ణయం
- పేపర్ ను పంపవద్దని ఏజంట్లకు వినతి
- ఇప్పటికే మూతబడిన కొన్ని ఆంగ్ల పత్రికలు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు హైదరాబాద్, మల్కాజిగిరి హాకర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకూ అన్ని దినపత్రికల పంపిణీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా, రేపటి నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని, తమ ప్రాంతంలోకి పత్రికల ఏజెంట్లకు పేపర్ సరఫరాను నిలిపివేయాలని కోరింది.
ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు, ఏజంట్లకు వినతిపత్రాన్ని అందించారు. కాగా, ఇప్పటికే కొన్ని ఆంగ్ల దినపత్రికలు నెలాఖరు వరకూ షట్ డౌన్ ను ప్రకటించాయి. మరికొన్ని పత్రికలు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. మల్కాజిగిరి హాకర్లు తీసుకున్న నిర్ణయాన్నే మరికొన్ని ప్రాంతాల హాకర్లు సైతం తీసుకునేందుకు చర్చిస్తున్నారని సమాచారం.