ట్విట్టర్ తొలగించిన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన రజనీకాంత్!
- రజనీ చేసిన ట్వీట్ పై విమర్శలు
- డిలీట్ చేసిన ట్విట్టర్
- తప్పుగా అర్థం చేసుకున్నారని రజనీ వివరణ
కరోనా వైరస్ పై రజనీకాంత్ చేసిన ట్వీట్ ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందంటూ, ట్విట్టర్ దాన్ని డిలీట్ చేసిన తరువాత, రజనీపై విమర్శలు వెల్లువెత్తగా, రజనీకాంత్ వివరణ ఇచ్చారు. స్వయంగా ట్విట్టర్ కల్పించుకుని, రజనీ ట్వీట్ ను తొలగించడంతో, పెద్ద చర్చే జరిగింది.
ఈ విషయంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని రజనీ తాజాగా వ్యాఖ్యానించారు. తాను 12 నుంచి 14 గంటల పాటు ప్రజలు బయటకు రాకుండా ఉంటే, థర్డ్ స్టేజ్ కి వైరస్ వెళ్లకుండా అడ్డుకోవచ్చని మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలు ఒక్క రోజుకు మాత్రమే పరిమితమని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఈ కారణంతోనే ట్విట్టర్ తన ట్వీట్లను తొలగించిందని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా ప్రజలు అన్ని జాగ్రత్తలనూ పాటించాలని రజనీకాంత్ సూచించారు. స్వీయ నియంత్రణతోనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని పిలుపునిచ్చారు.