కరోనాను దీటుగా ఎదుర్కోగల దేశం ఇండియా: డబ్ల్యూహెచ్ఓ
- గతంలో పోలియో, స్మాల్ పాక్స్ ను నివారించిన అనుభవం
- మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునే సామర్థ్యం ఇండియాకుంది
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జే ర్యాన్
గతంలో స్మాల్ పాక్స్ (మశూచి), పోలియో వంటి వ్యాధులను అత్యంత సమర్థవంతంగా నివారించిన అనుభవంతో, కరోనాను సైతం భారత్ దీటుగా ఎదుర్కొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జే ర్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునే అద్భుత సామర్ధ్యం ఇండియా సొంతమని తాను భావిస్తున్నట్టు ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జనసాంద్రతను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వైరస్ వ్యాపించకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు.