మధ్యప్రదేశ్‌లో కొలువుదీరిన బీజేపీ సర్కారు.. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన శివరాజ్‌సింగ్
- నాలుగోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన శివరాజ్ సింగ్
- రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా కార్యక్రమం
- శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
మొత్తానికి మధ్యప్రదేశ్‌లో బీజేపీ గద్దెనెక్కింది. అనూహ్య పరిణామాల మధ్య ఆ పార్టీ సీనియర్ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ లాల్జీ టాండన్ రాజ్‌భవన్‌లో ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి. 2005, 2008, 2013లో సీఎంగా పనిచేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా సాగింది.
పార్టీ సీనియర్ నేతలైన అరుణ్ సింగ్, వినయ్ సహస్రబుద్దే తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివరాజ్‌సింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆకాంక్షించారు. ఆయనో పరిపాలన దక్షుడని కొనియాడారు.