ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. అమరావతి భూలావాదేవీల వ్యవహారం సీబీఐకి అప్పగింత!

  • అమరావతిలో భూ అక్రమాలు జరిగినట్టు వైసీపీ ఆరోపణలు
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న క్యాబినెట్ సబ్ కమిటీ
  • లోతైన విచారణ కోసం కేసు సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు
ఏపీ రాజధాని అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అమరావతి భూముల వ్యవహారంపై గతంలోనే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ నిజమేని సబ్ కమిటీ పేర్కొన్న నేపథ్యంలో, సీఐడీ, సిట్ కూడా విచారణ జరిపాయి. టీడీపీ నేతలు బినామీ పేర్లతో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిపారని సబ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో, దీనిపై మరింత లోతుగా విచారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తాజా నిర్ణయం తీసుకున్నారు.


More Telugu News