అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయాలంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులు

  • ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో కరోనా భయం
  •  ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశం కల్పించాలని వినతి
  • ఒకరోజు జీతం సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తామని వెల్లడి
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ ఆమోదానికి ఆర్డినెన్స్ చేసినా సరిపోతుందని, కరోనా నేపథ్యంలో వీలైనంత మేరకు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 16 ఏళ్ల కిందట ఇలాంటి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్ సాయంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించారని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. అంతేకాకుండా, కరోనా మహమ్మారిపై పోరాటానికి తాము కూడా మద్దతిస్తున్నామని, సీఎం రిలీఫ్ ఫండ్ కు ఏపీ సచివాలయ ఉద్యోగులు తమ ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేస్తారని తెలిపారు.


More Telugu News