కరోనా ముప్పును తెలిపే సరికొత్త వ్యవస్థను తీసుకువచ్చిన అపోలో
- అపోలో నుంచి కరోనా వైరస్ రిస్క్ స్కాన్
- ప్రశ్నల ఆధారంగా వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే టెక్నాలజీ
- ఓ వ్యక్తికి కరోనా సోకే అవకాశాలను వివరించే స్కానర్
ఇప్పుడు ఎవరిని కదిలించినా కరోనా తప్ప మరో మాట లేదు. ప్రభుత్వాల దృష్టంతా దీనిపైనే! రాష్ట్రాలకు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి. ఈ వైరస్ మహమ్మారి అంతలా భయపెడుతోంది. ఈ నేపథ్యంలో, కరోనా వైరస్ ముప్పు ఎవరికి ఎంత ఉందనే విషయం తెలిపేందుకు అపోలో వైద్య సంస్థ సరికొత్త వ్యవస్థను తీసుకువచ్చింది. దీన్ని 'కరోనా వైరస్ రిస్క్ స్కాన్' అని అంటారు. తమకు కరోనా సోకే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో వ్యక్తులు స్వయంగా ఈ స్కానర్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఓ వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయన్న దాన్ని ఆధారంగా చేసుకుని ఈ స్కానర్ కరోనా ముప్పును అంచనా వేస్తుంది. దీన్ని కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించారు. ఇది ఎలా పనిచేస్తుందంటే.... ఓ వ్యక్తి ఈ స్కానర్ కు ఎనిమిది ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. వయసు, లింగం, జలుబు, గొంతునొప్పి, పొడిదగ్గు, ప్రస్తుత శరీర ఉష్ణోగ్రత, ప్రయాణ చరిత్ర, డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ వ్యాధుల వంటి గత అనారోగ్య చరిత్ర, బీపీ తదితర అంశాలపై వ్యక్తి నుంచి జవాబులు తీసుకుని వాటిని ఈ స్కానర్ విశ్లేషిస్తుంది. ఆ వ్యక్తికి కరోనా సోకే అవకాశాలు ఎంత మేర ఉన్నాయన్నది వెంటనే చెప్పేస్తుంది.
దీంట్లో 'హై రిస్క్', 'మీడియం', 'లో' అనే మూడు కేటగిరీలు ఉంటాయి. 'హైరిస్క్' అని స్కానర్ పేర్కొందంటే ఆ వ్యక్తికి కరోనా సోకే చాన్సులు మెండుగా ఉన్నాయని భావించాలి. 'మీడియం' అని పేర్కొంటే కొంతమేర వచ్చే అవకాశాలు ఉన్నట్టు! 'లో' అంటే ఆ వ్యక్తి సేఫ్ అని భావించాలి. 'హైరిస్క్' లేదా 'మీడియం' అని వస్తే, కరోనా ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ స్కానర్ వివరిస్తుంది. డాక్టర్ ను సంప్రదించాలో వద్దో కూడా చెప్పేస్తుంది. ఈ కరోనా వైరస్ స్కానర్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు అభివృద్ధి చేశారు.