కరోనా నుంచి కోలుకున్నా... ఇతర అనారోగ్య సమస్యలు కబళించాయి!
- ముంబయిలో ఫిలిప్పీన్స్ కు చెందిన వ్యక్తి మృతి
- కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిక
- షుగర్, ఆస్తమాతో బాధపడుతున్న వ్యక్తి
- కరోనా తగ్గడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు
ముంబయిలో ఓ ఫిలిప్పీన్స్ దేశస్తుడిని దురదృష్టం వెంటాడింది. ఫిలిప్పీన్స్ కు చెందిన ఓ వృద్ధుడు కరోనా లక్షణాలతో ముంబయిలోని కస్తూర్బా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఆ వ్యక్తికి కరోనా ఉన్నట్టు వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయింది. కస్తూర్బా ఆసుపత్రిలో కొన్నిరోజుల చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకున్నాడు.
అయితే ఆ ఫిలిప్పీన్స్ దేశస్తుడికి డయాబెటిస్, శ్వాసకోశ సమస్యలుండడంతో అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఆ వ్యక్తికి కరోనా నెగెటివ్ వచ్చినా, ఇతర అనారోగ్య సమస్యలే మరణానికి దారితీశాయని కేంద్రం ప్రకటించింది. అటు, మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 89 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.