టోక్యో ఒలింపిక్స్ కంటే క్రీడాకారుల ఆరోగ్యమే ముఖ్యమని తేల్చి చెప్పిన ఆస్ట్రేలియా
- జూలై 24 నుంచి టోక్యో వేదికగా ఒలింపిక్స్!
- ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా
- ఒలింపిక్స్ లో పాల్గొనరాదని ఆస్ట్రేలియా నిర్ణయం
- ఇప్పటికే తప్పుకున్న కెనడా
టోక్యో ఒలింపిక్స్ నిర్వహణకు కరోనా వైరస్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఓవైపు ఒలింపిక్స్ పోటీలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భావిస్తున్నా, సభ్యదేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టోక్యో క్రీడల్లో తాము పాల్గొనడంలేదని కెనడా ఇప్పటికే ప్రకటించగా, తాజాగా ఆస్ట్రేలియా కూడా ఆ జాబితాలో చేరింది. టోక్యో ఒలింపిక్స్ లో తాము పాల్గొనబోవడం లేదని ప్రకటించింది. ఒలింపిక్స్ కంటే తమ అథ్లెట్ల ఆరోగ్యమే ముఖ్యమని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.
తమ ఒలింపిక్ బృందాన్ని టోక్యో పంపించాలన్న ఆలోచన విరమించుకున్నామని, ఒలింపిక్స్ నిర్వహణపై ఐఓసీ నిర్ణయం వచ్చేవరకు వేచిచూడలేమని ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ చీఫ్ మాట్ కరోల్ తెలిపారు. ఒలింపిక్స్ జరుగుతాయా, లేదా అనే అనిశ్చితిలో ఉన్న తమ అథ్లెట్లు ఈ నిర్ణయంతో కుదుటపడతారని కరోల్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అతిపెద్ద క్రీడాసంరంభంగా పేరుగాంచిన ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జపాన్ లో టోక్యో వేదికగా జరగాల్సి ఉంది. కానీ కరోనా విజృంభణతో ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.