ఇంటి నుంచే మీ వాదనలు వినిపించండి: న్యాయవాదులకు సుప్రీం ఆదేశం
- అత్యవసర కేసులకు వీడియోకాన్ఫరెన్స్ వినియోగించుకోవాలని సూచన
- కరోనా కట్టడి నేపథ్యంలో నిర్ణయం
- ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా న్యాయవాదులు ఇంటి నుంచే తమ వాదనలు వినిపించుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సుప్రీం చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే తెలిపారు.
‘న్యాయవాదులు వీడియో కాల్ కనెక్ట్ చేసుకునేందుకు కొన్ని లింక్‌లు ఇస్తాం. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని మీ వాదనలు వినిపించండి’ అని బోబ్డే తెలిపారు. ఈరోజు సాయంత్రం నుంచి న్యాయవాదుల చాంబర్లన్నీ మూసివేస్తున్నామని, న్యాయవాదులు రేపు సాయంత్రానికల్లా ముఖ్యమైన పత్రాలు ఏమైనా ఉంటే తమ చాంబర్ల నుంచి తీసుకువెళ్లాలని సూచించారు. కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా సుప్రీం కోర్టు కూడా ఇలా స్పందించింది.