'అల్లుడు అదుర్స్' సాంగ్ కోసం నిధి అగర్వాల్ కి భారీ పారితోషికం

  • బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'అల్లుడు అదుర్స్'
  • కథానాయికలుగా నభా నటేశ్ - అనూ ఇమ్మాన్యుయేల్ 
  • నిధి పారితోషికం 80 లక్షలు  
తెలుగు తెరకి 'సవ్యసాచి' సినిమాతో నిధి అగర్వాల్ పరిచయమైంది. ఈ సినిమాతో పాటు ఆ తరువాత చేసిన 'మిస్టర్ మజ్ను' చిత్రం కూడా పరాజయంపాలు కావడంతో అమ్మడి పనైపోయిందని అనుకున్నారు. కానీ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో నిధి సక్సెస్ ను దక్కించుకుంది. ఈ సినిమాలో ఆమె అందాల ఆ ఆరబోతకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. యూత్ లో ఆమె క్రేజ్ ను గుర్తించిన దర్శక నిర్మాతలు ఆమెకి అవకాశాలు ఇవ్వడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.

దాంతో సహజంగానే ఆమె పారితోషికం పెరిగిపోయింది. ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా ఆమె వెనుకాడటం లేదు. అయితే ఐటమ్ సాంగ్ కి కూడా భారీగానే పారితోషికాన్ని వసూలు చేస్తోందట. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'అల్లుడు అదుర్స్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, బెల్లంకొండ సరసన నభా నటేశ్ - అనూ ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐటమ్ నెంబర్ కోసం నిధి అగర్వాల్ ను తీసుకున్నారు. ఇందుకోసం పారితోషికంగా ఆమె 80 లక్షలను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు.


More Telugu News