విమానంలో కరోనా అనుమానితులు.. కిటికీ ద్వారా దిగిన పైలట్‌!

  • అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించిన సిబ్బంది
  • అందరికీ నెగిటివ్‌  ఫలితం
  • పూణే నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఏషియా విమానంలో ఘటన
విమానంలో కరోనా వైరస్‌ అనుమానితులు ఉన్న విషయం ఓ పైలట్‌ను కంగారు పెట్టించింది. విమానాన్ని కిందికి దించిన వెంటనే కాక్‌పిట్‌ నుంచి బయటికి వెళ్లేందుకు స్లైడ్ రూపంలో ఉండే కిటికీ నుంచి కిందికి దిగాల్సి వచ్చింది. పూణే నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఏషియా విమానంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విమానం మొదటి వరుసలో కరోనా లక్షణాలున్న ప్రయాణికులు కూర్చున్నట్టు తమకు సమాచారం అందిందని ఎయిర్ ఏషియా సంస్థ ప్రతినిధి తెలిపారు. వారికి పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్‌ అని తేలిందని చెప్పారు. అయితే, ముందు జాగ్రత్తగా ఆ విమానాన్ని రిమోట్‌ బే వద్ద నిలిపామని, కరోనా లక్షణాలున్న ప్రయాణికులు ముందు ద్వారం నుంచి దిగారని తెలిపారు. మిగతా ప్రయాణికులను సిబ్బంది సాయంతో వెనుక ద్వారం నుంచి బయటికి తీసుకొచ్చామన్నారు.

ముందు డోర్ నుంచి ప్రయాణికులు బయటికి వచ్చేంతవరకు కాక్‌పిట్‌లో
ఉన్న సిబ్బంది స్వీయ నిర్బంధంలో ఉన్నారని చెప్పారు. అనంతరం విమానం కెప్టెన్ సురక్షిత పద్ధతిలో రెండో ద్వారం నుంచి కిందికి దిగారని తెలిపారు. అనంతరం విమానాన్ని పూర్తిగా శుభ్రం చేశామని  ప్రతినిధి వెల్లడించారు.


More Telugu News