కరోనాపై పోరాటానికి వేదాంత గ్రూప్స్ చైర్మన్ రూ. వంద కోట్ల విరాళం
- పెద్ద మనసు చాటుకున్న అనిల్ అగర్వాల్
- దేశానికి ఇప్పుడు మన అవసరం ఉందన్న అనిల్
- రోజువారీ కూలీల పరిస్థితిపై ఆందోళన
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ ప్రాణాంతక వైరస్‌తో పోరాటానికి కార్పొరేట్ దిగ్గజాలు కూడా ముందుకొస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తన వంతుగా రూ. 100 కోట్ల భారీ విరాళాన్ని ఇస్తున్నట్టు వేదాంత గ్రూప్స్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
దేశానికి ఇప్పుడు మన అవసరం ఉందన్న అనిల్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ముఖ్యంగా రోజువారీ కూలీల గురించి తాను ఆందోళనకు గురవుతున్నానని చెప్పారు. వారికి తనకు తోచినంత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేసేందుకు ముందుకొచ్చిన అనిల్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఆయన ఉదాత్త హృదయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.