లోయర్ సర్క్యూట్ ను తాకిన స్టాక్ మార్కెట్... ట్రేడింగ్ నిలిపివేత!
- 10 శాతం నష్టపోయిన బెంచ్ మార్క్ సూచీలు
- ఇన్వెస్టర్ల ప్యానిక్
- 27 వేల దిగువకు సెన్సెక్స్
భారత స్టాక్ మార్కెట్ పాతాళానికి దిగజారడంతో, కల్పించుకున్న సెబీ, ట్రేడింగ్ ను నిలిపివేసింది. ఈ ఉదయం 10 గంటల సమయంలో మార్కెట్ నష్టం శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే 10 శాతానికి మించి పడిపోయి లోయర్ సర్క్యూట్ ను తాకడంతో ట్రేడింగ్ నిలిచిపోయింది. ట్రేడింగ్ నిలిచిన సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,991 పాయింట్ల నష్టంతో 26,924 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 842 పాయింట్ల నష్టంతో 7,903 పాయింట్ల వద్ద ఉన్నాయి.
యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 19.98 శాతం నష్టపోగా, ఐసీఐసీఐ 15 శాతం, ఇండస్ ఇండ్ 14.99 శాతం, బజాజ్ ఫైనాన్స్ 14.23 శాతం, హీరో మోటో 13.90 శాతం నష్టాల్లో ఉన్నాయి. కాగా, గత వారంలో కూడా మార్కెట్ సూచీలు లోయర్ సర్క్యూట్ ను తాకిన వేళ, ట్రేడింగ్ ను 45 నిమిషాల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే.