విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ
  • విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా విక్రమ్ కుమార్
  • చైతూతో విక్రమ్ కుమార్ సంప్రదింపులు 
  • మరో ప్రేమకథకు సన్నాహాలు  
మొదటి నుంచి కూడా విక్రమ్ కుమార్ సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ ఎక్కువ తీసుకుంటారు. కథా కథనాల విషయంలో ఆయన ఎక్కువ కసరత్తు చేస్తారు. స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసుకున్న తరువాతనే ఆయన సెట్స్ పైకి వెళతారు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'గ్యాంగ్ లీడర్' ఓ మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్ లో ఆయన చేసిన ప్రయత్నానికి ప్రశంసలు లభించాయి.

ఈ సారి ఆయన మరో కథను సిద్ధం చేసుకున్నారట. ఆ కథకి నాగచైతన్య అయితే కరెక్ట్ గా ఉంటుందని భావించిన ఆయన, ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెబుతున్నారు. ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. ప్రేమకథా చిత్రాలపై విక్రమ్ కుమార్ కి మంచి పట్టుంది. 'ఇష్టం' .. 'ఇష్క్' .. 'హలో' సినిమాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. త్వరలో శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ'తో చైతూ ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే.


More Telugu News