కీలక నిర్ణయం తీసుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు

  • మే 28 వరకు ప్రొఫెషనల్ క్రికెట్ వాయిదా
  • బ్రిటన్‌లోనూ విజృంభిస్తున్న కోవిడ్
  • ఇప్పటి వరకు 281 మంది మృతి
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం షట్‌డౌన్ అవుతున్న నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మే 28వ తేదీ వరకు ప్రొఫెషనల్ క్రికెట్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ), ఫస్ట్‌ క్లాస్‌ కౌంటీలు, ప్రొఫెషనల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (పీసీఏ)లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీబీ తెలిపింది.

కాగా, కరోనా వైరస్ బ్రిటన్‌లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 5,683 మంది కరోనా బారినపడగా, 281 మంది మృతి చెందారు. 135 మంది బాధితులు కోలుకున్నారు. మరోవైపు, బ్రిటన్‌లో కరోనా ముప్పు ఉందని భావిస్తున్న 15 లక్షల మందిని మూడు నెలలపాటు బయటకు రావొద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది.


More Telugu News