ఐసీసీ పోల్‌లో కనిపించని రోహిత్ ఫొటో.. ఒకరు మిస్సయ్యారంటూ ‘హిట్ మ్యాన్’ ట్వీట్
- పుల్‌షాట్‌పై ఐసీసీ పోల్
- కోహ్లీ ఫొటో పెట్టి రోహిత్‌ను విస్మరించిన ఐసీసీ
- రోహిత్ అభిమానుల విమర్శలతో వెనక్కి తగ్గిన ఐసీసీ
పుల్‌షాట్ విషయంలో నిర్వహించిన పోల్‌లో తన ఫొటోను చేర్చకపోవడంపై టీమిండియా ‘హిట్‌మ్యాన్’ రోహిత్‌శర్మ ఐసీసీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ కింది బ్యాట్స్‌మెన్‌లలో పుల్‌షాట్ ఎవరు బాగా ఆడతారంటూ ఐసీసీ ఓ పోల్ నిర్వహించింది. ఇందులో భాగంగా వివ్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, హెర్ష్‌లే గిబ్స్, విరాట్ కోహ్లీ ఫొటోలు పోస్టు చేసింది. అయితే, పుల్‌షాట్‌ను అలవోకగా ఆడే రోహిత్‌శర్మను ఐసీసీ మర్చిపోయింది.
ఈ పోల్ చూసిన రోహిత్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఇందులో ఒకరు మిస్సయినట్టున్నారే’ అని ట్వీట్ చేశాడు. ‘హిట్‌మ్యాన్’ ట్వీట్‌కు అభిమానులు మద్దతు పలికారు. కోహ్లీని చేర్చి రోహిత్‌ను చేర్చకుండా ఐసీసీ తప్పుచేసిందని అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన ఐసీసీ రోహిత్ ఫుల్‌షాట్లతో కూడిన ఓ వీడియోను పోస్టు చేసి విమర్శల నుంచి తప్పించుకుంది.