కరోనా ప్రభావంతో వెనక్కి వెళ్లిన ఏపీపీఎస్సీ పరీక్షలు
- ఏపీలోనూ కరోనా ప్రభావం
- మార్చి, ఏప్రిల్ లో జరగాల్సిన పరీక్షలు
- కరోనా కారణంగా వాయిదా వేశామని చెప్పిన ఏపీపీఎస్సీ కార్యదర్శి
కరోనా వైరస్ ధాటికి వ్యవస్థలే కుప్పకూలుతున్నాయి. తాజాగా ఏపీలో మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలు వాయిదాపడ్డాయి. ఏప్రిల్ 7 నుంచి 9వ తేదీ వరకు జరగాల్సిన గ్రూప్-1 పరీక్షలు, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ డిగ్రీ కాలేజి లెక్చరర్లు, కంప్యూటర్ నిపుణత పరీక్షలను కరోనా ప్రభావంతో వాయిదా వేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.